నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాలను సమాచార చట్టం కింద వెల్లడించడానికి గల అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు ప్రభుత్వ0ని ప్రశ్నించింది. చిత్తూరు ఎమ్మెల్యే సీ.కే. బాబుకు నేరచరిత్ర ఉందని, ఆయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయనకు కల్పించిన భద్రతపై సమీక్ష జరపాలంటూ దాఖలయిన ఓ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారిస్తూ వివరాలు ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారని ... ప్రశ్నించారు.
గన్‌మ్యాన్‌లను దుర్వినియోగం చేస్తున్న సీకే బాబుకు కల్పించిన భద్రతకు సంబంధించిన వివరాలను ఆర్‌టిఐ యాక్టు కింద కోరితే అధికారులు తిరస్కరించ దమేంతని నిలదీస్తూ... అన్ని వివరాలు సోమవారంలోగా అందించాలని కేసు విచారణను వాయిదా వేశారు.