కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు విమర్శిస్తే నరికి చంపుతామంటూ మాజీ ఎమ్మెల్సీ రహమాన్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీనిపై రహమాన్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే పది మంది టీం హైదరాబాద్ బయలుదేరిందని పోన్‌చేసిన అగంతకులు తనతో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే చంపుతామని, బాడీని పది ముక్కలు చేసి పది చోట్ల పడేస్తామని, ఇలాంటి తాటకు చప్పుళ్ళకు బెదిరేది లేదని, ఒకవేళ తనకు ఏదైనా జరిగితే కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని దొరల తెలంగాణను తాను సమర్థించనని రహమాన్ అన్నారు.
నిజామాబాద్‌లోని మూడు కాయిన్ బాక్స్‌లనుంచి ఈ కాల్స్ వచ్చినటుల సమాచారం.