టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని పాలకుర్తి ఎమ్మెల్యే టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు..ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వ హోమంత్రి చిదంబరంతో చర్చలు జరుపడానికి వెళ్లిన సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రోజు మొత్తం కనిపించకుండా ఢిల్లీలో కనుమరుగయ్యాడని, ఆరోజే అనుమానం కలిగిందన్నారు.
ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకుంటోందni తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పూనుకోకముందే కేసీఆర్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నాడన్నారు.తెలంగాణ మేధావులు, విద్యార్థులు ఇప్పటికైనా వాస్తవాలను గమనించాలని దయాకర్‌రావు అన్నారు.