13, నవంబర్ 2010, శనివారం

రోడ్డెక్కిన రోశయ్య

సాక్షాత్తూ సీఎం రోశయ్యే రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో ధర్నా జరిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తరఫున పనిచేస్తున్నారని ఆరెస్సెస్ మాజీ అధినేత సుదర్శన్ ఇటీవల విమర్శి 0చినందుకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రే బషీర్‌బాగ్ కూడలిలో అమాలులో ఉన్న సెక్షన్‌ను ఉల్లంఘించి ధర్నాలో పాల్గొన్నారు.

'పీసీసీ ధర్నాలో సీఎం రోశయ్య ప్రసంగిస్తూ.. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు తానూ ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. సోనియా త్యాగాలు వెలకట్టలేనివి. ప్రధాని పదవిని ప్రజలు రెండు సార్లు చేతిలో పెట్టినా.. ఆమె వద్దన్నారు. ప్రజల కోసం కష్టపడతానంటూ ప్రధాని పదవినే త్యాగం చేసిన సోనియాను విమర్శించడం సరికాదు. సుదర్శన్ తక్షణం బహిరంగక్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.