ముఖ్యమంత్రి రోశయ్య, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు...ఇద్దరూ కూడ బలుక్కుని హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ గా చేయాలని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, శాసనసభ్యుడు హరీశ్‌రావు ఆరోపించారు.
హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి, తెలంగాణ యువత ఉద్యోగాలను కొళ్లగొట్టే యత్నాలను తిప్పికొడతామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య పోలవరం ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ 14(ఎఫ్) క్లాజ్ తొలగింపుపై చూపడం లేదని ఆయన విమర్శించారు.