బీసీలను రాజకీయంగా అ ణగదొక్కుతున్న టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు తమకు ప్రథమ శత్రువని బీసీ ఐక్య సంఘర్షణ సమితి నాయకు లు దుయ్యబట్టారు.
బీసీ ఐక్య సంఘర్ష ణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెల్ది చక్రధర్.. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీలకు ముఖ్యమంత్రి, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ అంటున్నారని, 55శాతం బీసీలకు ఏ పదవులు ఇస్తారో తేల్చి చెప్పాలని అన్నారు..కేసీఆర్ మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మభ్యపెడుతూ రాజకీయంగా పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు.