ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనే డిమాండ్‌తో ప్రజలు, రైతులు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాల్సి న అవసరం ఆసన్నమైందని మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పి లుపునిచ్చారు.
శ్రీకృష్ణ కమిటీలో జలవనరుల అంశం కోసం నియమించిన సీడబ్ల్యూసీ సభ్యుడు ఏడీ మొహిలీ గోదావరి జలాలపై ఏక పక్షంగా తెలంగాణకు అనుకూలంగా నివేదించబోతున్నారని ... అందులో భాగంగానే తమ వాదనల్ని అసంతృప్తిగానే విన్నారని చెప్పారు.
పోలవరం, ద మ్ముగూడెం ప్రాజెక్ట్‌లు తెలంగాణ, ఆం ధ్రాలకు ఉపయోగపడతాయని చెప్పినపుడు సైతం దమ్ముగుడెం తెలంగాణకు ఉపయోగపడదని ఆయన ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది. పోలవరం నిర్మిస్తే హైడల్ ప్రాజెక్ట్ ప్రయోజనం కలుగుతుందని చెప్పినపుడు సీలేరు, మాచ్‌కండ్ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ సరిపోతుందిలే అని చెప్పిన మొహిలీ మాటలు ఆంధ్రా ప్రాంతానికి అ న్యాయం చేసే విషయం అర్ధమవుతుందని శ్రీనివాస్ తెలిపారు.