16, నవంబర్ 2010, మంగళవారం

తూలుతూ... కాసులు కురిపిస్తున్న దాబాలు

జాతీయ రహదారిపై దాబాలలొ ఎక్కువ శాతం చీఫ్ లిక్కర్ అమ్మకాలు కొనసాగుతు కాసులు కురిపిస్తునడటంతో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రతి చోటా అక్రమ సిట్టింగులు కొనసాగుతున్నాయి. ప్రతి నిత్యం పో లీసులతో సహా ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు ఈ రహదారులపై తిరుగుతూన్నా వీటిపై దాడులు జరిగిన ఆనవాళ్లు లేవు.

దాబాల్లో మద్యం విక్రయాలు చేయవద్దు. అక్రమ సిట్టింగులకు ఎలాంటి అనుమతి లేదు. అని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నా దాడులు చేసిన సందర్భాలు అరుదే.. దీంతో లారీ డ్రైవర్లు మద్యం తాగుతూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు..

రాజకీయ ఒత్తిళ్లు.. దాబాల నిర్వాహకులు ఎక్సైజ్ సి బ్బందికి నెలనెలా మామూళ్లు పం పడం వల్లే వారు చూసీచూడనట్లు వ్య వహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులకు లొంగని వాళ్లను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని పేరు చె ప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.