ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేని సభలో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొని నినాదాలు చేశాడని, గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.
పోలీస్ ఉత్తర్వులను అతిక్రమించి ధర్నా చేస్తుంటే.. ముఖ్యమంత్రి పక్కన ఉన్నవారందరిని పోలీసులు అరెస్టు చేశారని, రోశయ్యకు ఎందుకు అరెస్టు చేయలేదని దీనిపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9న ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉండే ఎన్‌డీఏ సభ్యులంతా కలిసి జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.