ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలలో కూరలు ఉడకడం లేదు. పొయ్యిపై దాక పెట్టి కూరవండే పరిస్థితి లేనప్పుడు తాలింపు ఊసేముంది.. మొత్తంగా పేద వర్గాలలో కూరలు వండుకోవడం మానుకునే పరిస్థితి దాపురించింది.
వారాంతపు సంతలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలను చూపించాయి. కూర వండుకునే పరిస్థితి కనిపించకపోవడంతో...ఇంటిలో తయారు చేసుకు న్న కూరకంటే కర్రీ పాయింట్ నుంచి కొనుగోలు చేసిన కూరకే తక్కువ ఖర్చు అవుతుం డటంతో కర్రీ పాయింట్లకు డిమాండ్ పెరిగింది. కర్రీ పాయింట్ల నుంచి రూ.5లు సాంబారు, రూ.10లు కూర కొనుగోలు చేసుకుని పూట గడిచింది అనిపిస్తున్నారు.