ఫ్రీజోన్ అంశాన్ని తేల్చే వరకు ఎస్సై రాత పరీక్షను నిర్వహించరాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు.
తమ సోదరుల ఉద్యోగాలు వేరొకరు ఆక్రమించు కొంటున్నారని తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ఫ్రీజోన్ అంశంపై సిఎం మాట్లాడకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.
15 రోజుల్లోగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఏదంటే తమ సత్తా చూపించేందుకు యావత్ తెలంగాణా రాష్ట్ర యువత సిద్దంగా ఉందన్నారు.