19, ఫిబ్రవరి 2011, శనివారం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మృతి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలం కడ్తాల్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున వాహనాన్ని మరో వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఝాన్సీని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. సంతోష్‌నగర్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రి వైద్యులు ఝాన్సీ మరణించినట్లు నిర్థారించారు. కాగా ఝాన్సీ మృతితో బీజేపీ వర్గాలు దిగ్బ్రాంతి చెందాయి.