నేతల ఆస్తులపై ఇడి ఆరా?
నల్ల ధనం రారాజు హసన్ అలి అరెస్టు తదనంతర పరిణామా లు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిశోధనలో రాష్ట్రానికి చెందిన పలువురు బడా రాజకీయ నేత లు, పేరుమోసిన వ్యాపారులతోనూ ఈ గుర్రాల నవాబుకు లావాదేవీలున్నాయని రూఢీ అవడంతో దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) లోతుగా ఆరా తీయ సాగింది. రాష్ట్ర o నుంచి పది వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విదేశాలకు తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు రంగం లో దిగిన ఇడి హవాలా రాయుళ్ల కదలికలపై నిఘా వేసింది. ఎక్కువ భాగం రాజకీయ నేతలకు సంబంధించినవేనని ఆరోపణ లు వస్తుండడంతో నేతల ఆస్తులపై ఇడి ఆరా తీయసాగింది. పదేళ్ల కాలంలో అతి సంపన్నలైన నేతల వివరాలను సేకరించడంపై ఇడి దృష్టి సారించింది.