31, మార్చి 2011, గురువారం

చిత్తూరు ని విడిచి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు

ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన చిత్తూరు జిల్లాలో పుట్టడం ఎవరికైనా సౌభాగ్యదాయకమని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. చిత్తూరు పట్టణంలో శతాబ్ది ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషాసంస్కృతీ సాంప్రదాయాల మేలుకలయికని, భిన్నత్వంలో ఇంతటి ఏకత్వాన్ని మరెక్కడా చూడలేమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వంటి తత్వవేత్తలు, రాజనీతికోవిదులు చిత్తూరు జిల్లా నుంచీ దేశానికి సేవలందించారని ప్రశంసించారు.తన బాల్యంలో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య పేరు బాగా వినిపించేదన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాను వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళద్దని .. అలా ఎవరైనా జిల్లాను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి వుండదన్నారు.