‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది.