31, మార్చి 2011, గురువారం
ఉద్యమ ద్రోహులెవరో బైట పెడతా...
తొందర్లేనే తెలంగాణ ద్రోహులెవరో తేలుస్తానని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తీరు విషయంపై అధిష్టానానికి కూడా వివరించా...నిర్ణయం వారిపైనే వదిలేసా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ...తాను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రత్యర్థిగాతెలుగుదేశం తరపున సిర్పూరు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐకే రెడ్డి నిలిస్తే వారు తెలంగాణ ద్రోహులు కాదా అని ప్రశ్నించారు.. తెలంగాణా కి ఉద్యమానికి ఎవేరెవరు ద్రోహం చేస్తున్నారో పూర్తి వివరాలను త్వరలోనే కాగజ్‌నగర్ లో బహిరంగ సభ పెట్టి వెల్లడిస్తానని సమ్మయ్య పేర్కొన్నారు.