సత్యసాయి బాబా ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశాయి. బాబాకు అన్ని రకాల పరీక్షలు చేశామని, హృద్రోగ నిపుణుల పర్యవేక్షణలో వైద్యసేవలు కొనసాగుతున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ ఏఎస్ సఫాయాతెలిపారు.