ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) సహా శాసనసభకు సంబంధించిన అన్ని కమిటీల్లోనూ రొటేషన్ ప్రాతిపదికన నేతలకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలో పీఏసీ కార్యాలయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి బుధవారం ఖాళీ చేయడంతో ఈసారి ఆయనకు అభ్యర్థిత్వం దక్కకపోవచ్చనడానికి ఇదే సంకేతమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే నిజమైతే ఈసారి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం దక్కొచ్చంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో 610 జీవో సభాసంఘానికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు.