19, మే 2011, గురువారం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగడ్ పోలీస్ స్టేషన్‌పరి«ధిలో గురువారం మధ్యాహ్నం మారంఘడ్- నారగొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి సీ-60 బలగాలకు చెందిన నలుగురు పోలీస్‌కానిస్టేబుళ్లు అ క్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న పోలీసులు మావోయిస్టులను వెంబడించి ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 15 మంది మావోయిస్టులు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు.