19, మే 2011, గురువారం

రాష్ట్రంలో వ్యవసాయం పండగ

రైతుల సమస్యల పేరిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు రాజకీయ డ్రామా కార్యక్రమాలుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. తెలుగుదేశం అధినేత రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని,, తికిలపడిన తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టుకునేందుకే సమస్యలను భూతద్దంలో చూపుతూ ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, 13 వేల కోట్ల రుణ మాఫీ, కౌలురైతులకు రుణ సౌకర్యం, అందుబాటులో ఎరువులు, పొలంబడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు.