27, అక్టోబర్ 2010, బుధవారం

డిసెంబర్ 15 నుంచి జగన్ విశాఖ ఓదార్పు



విశాఖ జిల్లాలో వై.ఎస్.జగన్ ఓదార్పు యాత్ర డిసెంబర్ 15వ తేదీ నుంచి జరగనుంది. ఈ మేరకు కొణతాల వర్గీయులు సమావేశమై జగన్ పర్యటన మార్గాన్ని ఖరారు చేశారు

వై.ఎస్.మరణానంతరం ఆ ఆవేదనను తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ అర్బన్ ప్రాంతంలో ఒక్కరు కూడా ఈవిధంగా చనిపోయిన వారు లేరు. రూరల్ ప్రాంతంలో కొంతమంది ప్రాణాలు విడిచారు. వీరిని ఓదార్చేందుకు జగన్ డిసెంబర్ 15 నుంచి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.

కనీసం వారం రోజులపాటు సాగేలా ఏర్పాట్లు చేస్తున్న ఈ ఊదార్పు యాత్రలో జగన్ గాజువాక, పరవాడ, అచ్యుతాపురం, పాయకరావుపేట,నర్సీపట్నం, అనకాపల్లి లలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.