27, అక్టోబర్ 2010, బుధవారం

నవంబర్ 18 నుండి సత్యసాయి జన్మదినోత్సవ వేడుకలు


సత్యసాయి 85వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సత్యసాయి హిల్‌వ్యూస్టేడియంలో జరిగే జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు రాష్టప్రతి, ప్రధానమంత్రి లాంటి అతిరథ మహారథులతో పాటు అంతర్జాతీయంగా ప్రతినిధులు హాజరవుతున్నారు. సర్వమత సమ్మేళనాన్ని చాటే విధంగా అంతర్జాతీయంగా దాదాపు 200దేశాలకు చెందిన జాతీయపతాకాలు ఎగురవేయడంతో పాటు సుందరంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు .. .వేడుకలను తిలకించడానికి విచ్చేసే దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు, లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తని రీతిలో తాత్కాలిక వసతిసౌకర్యాలతో పాటు బసచేసే వారికి అన్ని రకాల వౌలిక వసతులను కల్పిస్తున్నారు

నవంబర్ నెల 18 నుండి జన్మదిన వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యే వేడుకల్లో భాగంగా 19న జరిగే మహిళాదినోత్సవానికి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేస్తారు. 22న జరిగే సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహాయంతో అంతర్జాతీయంగా సత్యసాయి జన్మదిన వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రసార సౌకర్యాన్ని కూడ కల్పిస్తున్నారు. నవంబర్ 17 నుండి 24 దాకా జన్మదిన వేడుకల్లో పాల్గొనే భక్తులకు 40 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నదానాన్ని ఎ ర్పాటు చేయటం తో పాటుగా లేజర్‌షోలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తోంది సత్య సాయి ట్రస్ట్ .