మనిషిని అంతరిక్షంలోకి పంపే పరిజ్ఞానాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. బుధవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న అయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ రష్యా భాగస్వామ్యంతో 2013లో చంద్రయాన్-2ను ప్రయోగించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో