27, అక్టోబర్ 2010, బుధవారం

అరకులోయలో ‘పేరెంట్స్’ షూటింగ్


అరకులోయ పరిసరాల్లో పేరేంట్స్ సినిమా షూటింగ్ జరుగుతోంది. వంశీకృష్ణా, రుతికాబొబ్బర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంజోడా గ్రామ సమీపంలో జరుగుతుంది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనందరవి దర్శకత్వం వహిస్తున్నారు. టేక్-1 ప్రొడక్షన్ బేనర్‌పై ఈ సినిమాను ఫ్రెండ్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.కె.బాలచంద్ర సమకూరుస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులపాటు పేరెంట్స్ సినిమా పాట, ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించి వైజాగ్‌లో మరో రెండురోజులు షూటింగ్ జరుపుతారు. పేరెంట్స్ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు ఆనందరవి తెలిపారు