27, అక్టోబర్ 2010, బుధవారం

పీక్కు తింటున్న'మైక్రో'లు

జనంను జలగల పీక్కు తింటున్న మైక్రో ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏకంగా మైక్రో సంస్థలకు ముకుతాడు వేసెందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ రుణ గ్రహితలకు ఏమాత్రం మేలు చేయడం లేదు. గత నాలుగైదు రోజులుగా మైక్రో ఫైనాన్స్‌ కంపనీల ప్రతినిధులు గ్రామాలలో మహిళలకు ఇచ్చిన రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. సర్కార్‌ చేసిన భిన్న ప్రకటనలతో రుణాలు చెల్లించాల వద్దా అన్న మీమాంసలో ఉన్న డ్వాక్రా మహిళలకు అధికార యంత్రాంగం కూడా సలహలు ఇవ్వక పోవడంతో అప్పులు తెచ్చి మైక్రో రుణాలు చెల్లిస్తున్నారు. బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదని, చేసిన లక్ష రూపాయల జరిమాన,మూడేళ్ళ జైలు శిక్ష అంటు చేసిన ప్రకటనలు ఏమాత్రం చెల్లడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చాయని... డబ్బులు చెల్లించక పోతే చక్రవడ్డితో భారంగా మారుతుందని మైక్రో ఫైనాన్స్‌ ప్రతినిధులు రుణాలు వసూలు చేసుకుంటు జనాన్ని పీడుస్తున్నారు.
రుణాలు పొందిన మహిళలు భయానికో కొందరు చెల్లించడంతో సంఘంలోని మిగిత సభ్యులు కూడా మళ్ళి బయట అప్పులు తెచ్చికట్టారు. ప్రభుత్వం మహిళలు ఆందోళన చెంది రుణాలు చెల్లిస్తున్నా.... అధికార యంత్రాగం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తున్నారు.

గ్రామ సంఘాలకు రూ.5లక్షల చొప్పున రుణాలు అందిస్తామన్న ప్రభుత్వం.. ఆచరణలో కనిపించకపోవడంతో మహిళలు మళ్ళి మైక్రో ఫైనాన్స్‌లనే ఆశ్రయించవలసి వస్తుందని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి

:రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ మరణాలకు కాంగ్రెస్‌ పార్టీనే బాధ్యత వహించాలని, ఆ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ క్షేత్రస్థాయి ప్రచారానికి, పోరాటానికి సిద్ధమవుతోంది..ఒక కాంగ్రెస్‌ ప్రముఖుడి సతీమణికి చెందిన మైక్రో సంస్థలు ప్రజలను పీడించి వేల కోట్ల రూపాయలు గడిస్తున్నాయని..పేద ప్రజలను పీడించే సంస్థలకు కాంగ్రెస్‌ ఏ స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిందో చెప్పడమే టీడీపీ లక్ష్య0. ఇప్పటివరకూ గుర్తించిన మైక్రో ఫైనాన్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా, రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిoచాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.