డిసెంబర్ 31 తరువాత చేపట్టే వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజలు సిద్ధమవ్వాలని, డిసెంబర్ 9న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో దీనిపై కార్యాచరణ రూపొందిస్తారని టిఆర్‌ఎస్ మాజీ ఎంపి వినోద్‌కుమార్ అన్నారు.
టిఆర్‌ఎస్ పల్లెబాట కార్యక్రమంలో. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల నుండి విన్పిస్తోందని, వారి ఆశయాల కనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయకుండా ప్రజలు అడ్డుపడి ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నారని, రాష్ట్రం ప్రకటించకుండా తాత్సారం చేయవద్దని, ప్యాకేజీలు ఇవ్వవద్దని తెలంగాణ ప్రకటించకుంటే ఊహించని సంఘటనలు జరుగుతాయన్నారు.
శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చినాక, డిసెంబర్ 31 తరువాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల రంగు బయటపడనుందని తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అంటున్న కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ బండారం, తెలంగాణ కోసం పోరాటం మాదే అసలైనదంటున్న టిడిపి, మేమే సాధిస్తామంటున్న బిజెపి తదితర రాజకీయ పార్టీల నిజస్వరూపం శ్రీకృష్ణ కమిటి నివేదిక తరువాత బట్టబయలవుతుందన్నారు.