రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి రోడ్డుపై ధర్నా చేశారు. తమ అధినేత్రిపై వచ్చిన అభియోగాలను నిరసిస్తూ సగటు కార్యకర్తతో పాటు రహదారిపై బైఠాయించారు. అదీ నిషేదాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ ఘట్టానికి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ కూడలి వేదిక అయింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఆర్ఎస్ఎస్ మాజీ అధినేత సుదర్శన్ చేసిన విమర్శలను నిరసిస్తూ ప్రదర్శనలు జరపాలని పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసరావు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.