12, నవంబర్ 2010, శుక్రవారం

చిరంజీవి కోరితే రాజకీయ శిక్షణ ఇస్తా ,.......

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కోరితే రాజకీయ శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వచ్చేవి కావని, అలవర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస ఉండి తనకు ఆహ్వానం పంపితే ....23 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను సినీరంగం నుంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన చిరంజీవికి రాజకీయ పార్టీల లక్షణాల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నానని ఒకవేళ తన ప్రతిపాదనను అపహాస్యంగా భావిస్తే 'అది వారి ఖర్మ...' అని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యం పార్టీకి ఒక్క ఎంపి కూడా లేనందున ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 33మంది కాంగ్రెస్ ఎంపిీలు గడిచిన 18 మాసాల్లో చేపట్టిన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.....ఎన్‌డీఎ హయాంలో రాష్ట్రానికి టీడీపీ ఎంపీలు ఏం సాధించారో చంద్రబాబునాయుడు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.