12, నవంబర్ 2010, శుక్రవారం

వాస్తవాలు దాగవు

కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎదురు దాడులు చేసినా వాస్తవాలు దాగవనే విషయం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు హెచ్చరించారు.

జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని సిీఎం రోశయ్య ఉలిక్కి పడుతున్నారని అందుకే మంత్రులపై ఆరోపణలను ఖండించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, అంబటి రాంబాబు, కొండా సురేఖ తదితరులు మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు చేశారని, వాటికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం రోశయ్య చేసిన ఆరోపణలకు ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారని, రోశయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారా..! అని ఆయన సవాలు విసిరారు.