జూన్, జూలై నెలల్లో జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు, గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోనున్న నేపథ్యంలో ఎన్నికలను సకాలంలోనే నిర్వహించే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమౌతోంది. ఐతే 2011 జనగణన చివరి దశకు చేరుకొన్నప్పటికీ .. పట్టించుకోకుండా 2001 గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని 'స్థానిక సంస్థల' ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమౌ తుండటమే చర్చనీయంసమవుతోంది .
బీసీ, మహిళలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న డిమాండ్‌తో పాటు జనగణన పూర్తి అయితే తమకు తప్పక ప్రాతినిథ్యం పెరుగుతుందని వివిధ వర్గాలు పెట్టుకొన్న ఆశలు ప్రభుత్వ యోచనతో అడియాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ ఎన్నికలనే ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఆ శాఖ ఉత్సాహం చూపు తూ... 2006 రిజర్వేషన్లనే ప్రాతిపదికగా తీసుకొంటూ సన్నద్ధం అవుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.