తెలంగాణపై కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉంది కానీ యూపీఏ వ్యతిరేకిస్తోందని, మరో కొత్త నాటకాన్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ శాసన సభ పక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతోందని, ఇందు కోసం జేఏసీ ప్రణాళికలు సిద్దం చేసిందని.. వచ్చేపార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ... సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రంతోనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.