29, జనవరి 2011, శనివారం

ఇలియానాను నానపెడుతున్నారు

అప్పుడెప్పుడో 'సలీం'లో చూసిన ఇలియానా అందాలు మళ్ళీ వీక్షించడానికి ఇంత టైం పడుతుందని ఎవరూ అనుకోలేదు. ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ గ్రీకు శిల్పం మళ్ళీ రానా చేతిలో పూరీ ఉలితో చెక్కుతున్న 'నేను నా రాక్షసి'తో బయటకు రాబోతోంది. అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు పూరీ కనీసం ఓ ఝలక్ కూడా ఇవ్వటంలేదు.

అప్పుడో ఇప్పుడో వర్మానే ఇలియానాను గోకుతుంటే ఊహించుకోవడం తప్ప సరైన పోస్టర్ ఒక్కటి కూడా బయటకి వదల్లేదు అంటే పూరీ ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వేసవిలో విడుదల అంటూ ఇప్పటికైతే చెప్పారు గానీ మళ్ళీ ఏం తేడా చేస్తారో అని ప్రేక్షకులు అనుమానిస్తుంటే, మీకు ఇలియానాను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటూ యూనిట్ సభ్యులు కూడా తమ వంతు డప్పేస్తున్నారు.

ఇంతలా ఊరిస్తూ, నానపెడుతుంటే ఇలియానా మాత్రం నాకేమి తెలియదన్నట్లుగా నవ్వేసి ఊరుకుంటోంది.

తుపాకి నుంచి సేకరణ