ఆమె వయసు నలభై మూడేళ్ళు. కానీ చీర చెంగును బొడ్డులో చెక్కి ఒక్కసారి డ్యాన్సు కట్టిందంటే దద్దరిల్లాల్సిందే. ఆమే మాధురి దీక్షిత్. ఇండియన్ సినిమా చరిత్రలో ఈమె అంతటి గొప్ప డ్యాన్సర్ రాలేదు ఇక రాబోదు అన్న వాక్కు అక్షరాలా నిజం.
ఇద్దరు పిల్లల తల్లైనా ఫీల్దుని వదిలి ఉండలేక అమెరికా నుండి ముంబైలో ఊడిపడ్డ మాధురి సినిమాలను అటుంచి బుల్లి తెర మీద మాత్రం రాణించే సూచనలు కనపడుతున్నాయి. వచ్చీరాగానే ఓ రియాలిటీ షోలో ఈమె చేసిన నృత్యం మేటి కొరియోగ్రాఫర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
మాధురి అంతటి అల్టిమేట్ డ్యాన్సర్ లేదు అన్నది కన్ఫర్మ్ అయిపొయింది కాబట్టి ఇక రానున్న కొత్తతరాలకి మన నృత్యం పట్ల అవగాహన కలిగించేందుకు వరల్డ్ వైడ్ డ్యాన్సు స్కూళ్ళను స్టార్ట్ చేసి దీన్ని కొత్త రకం బిజినెస్ లాగా రూపొందించాలని పక్కా ప్రణాళికతో ముంబైలో వర్క్ మొదలెట్టింది. మల్లెతీగ లాంటి నడుమును మెరుపుతీగ లాగా ఊపడం చూసిన అభిమానులు ఇక మున్ముందు మాధురిలో ఓ టీచరమ్మను చూస్తారు.