ఖాళీగా కూర్చుంటే ఎంతటి వారినైనా లోకం లోకువగానే చూస్తుంది. కానీ కృష్ణవంశీ విషయంలో ఈ ఫార్ములా పని చేయదు. క్రియేటివిటి అన్న పదానికి కమర్షియల్ హంగులను జోడించడంలో తనకంటూ ఓ ముద్రను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొద్దికాలంగా గడ్డు పరిస్థితినే కల్లజూసాడు.
మహాత్మా, శశిరేఖా పరిణయంలాంటి సినిమాలు తీసి ఎటూ కొరగాకుండా పోయాడు. కుటుంబ కథా చిత్రాలను, యువతను ఆకట్టుకునే చిత్రాలను, సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రాలను...ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలోను తన మార్క్ చూపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఏ కథనైనా ఒకే యాక్షన్ కథలా ఫీలయ్యే గోపీచంద్ తో సినిమా ఒప్పుకున్నాడంటే ఎలా ఉండబోతుందో అన్న ఉత్సూకత స్టార్ట్ అయ్యింది.
'వాంటెడ్'తో మోస్ట్ అన్ వాంటెడ్ హీరోల జాబితాలో చేరిపోయిన గోపీచంద్ మరి కృష్ణవంశీనే మారుస్తాడో లేక రివర్స్ జరిగే చాన్సులు ఏమైనా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
తుపాకి నుంచి సేకరణ