శ్రీకృష్ణ కమిటీ నివేదిక , చాప్టర్-8లో శాంతి భద్రతలకు సంబందించిన అంశాలపై సీల్డ్ కవర్‌లో ఇచ్చిన అంశాలను బహిర్గతం చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ, న్యాయవాది ఎం.నారాయణరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఒక భాగాన్ని రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని అధికరణం 21కి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.