యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, సెన్సేషనల్ హీరో మాస్ రాజా రవితేజ హీరోగా నటించగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లుగా, "షాక్"ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల అనే నూతన నిర్మాత నిర్మించిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "మిరపకాయ్".ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి,హీరో రవితేజ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనీ, అందుకు రుజువుగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లను నిర్మాత మీడియాకు అందజేశారు.
ఆ వివరాలు మీకోసం.
నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్ణాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
ఈ విధంగా "మిరపకాయ్" చిత్రం రెండు వారాలకు గాను 25 కోట్ల,నాలుగు లక్షల,నలభై వేలు వసూలుచేసిందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేస్తూ, ఇమతటి ఘనవిజయం అందించిన ఆంధ్ర ప్రేక్షకులకూ, తమ హీరో రవితేజకూ, దర్శకుడు హరీష్ శంకర్ కూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.