29, జనవరి 2011, శనివారం

పవన్ కళ్యాణ్ భజన మండలి

ఫీల్డులో సీనియర్ మోస్ట్ అయినా టేస్టులో పక్కా సిల్లీ, నాటు ఫెలో అనిపించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ 'మిరపకాయ'తో ఇంత పెద్ద హిట్టు కొడతానని కల్లో కూడా అనుకోలేదు. 'అసలు నేను తీసింది ఎంత. మీరు చూపిస్తున్న ఆదరణ ఎంత?' అంటూ తన సినిమాతో తనకే షాకు కొట్టినట్టు ఫీలవుతున్నాడు.

'సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అంతా అన్నయ్య (చిరంజీవి అనుకునేరు కాదు రవితేజ అన్నయ్య) ఎనర్జీ మహిమే. అసలు మా అన్నయ్య అంటే. ......' అంటూ ఎక్కడ దొరికితే అక్కడ రవితేజను ఆకాశానికి ఎత్తుకుంటున్న హరీష్ దగ్గర దర్శకత్వం ఏమో గానీ తనని తాను మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఎక్కువేనట. ఎప్పుడు లేనిది రవితేజకు కూడా ఓ భజన మండలిని స్థాపించిన హరీష్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ భజన మండలిలో మొన్నే సభ్యత్వం పుచ్చుకున్నాడట.

ఒక్కసారి షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అక్కడి నుండి ప్రతిరోజు సామూహిక భజనలు, హరికథలు, బుర్రకథలు రెగ్యులర్ గా నిర్వహించి 'గబ్బర్ సింగ్' అయిపోయేలోపు ఎలాగైనా భజన మండలి చైర్మన్ పోస్టు కొట్టేసి అక్కడి నుండి మెగా భజన మండలిలో ప్రవేశం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అంటే మిరపకాయ పబ్లిసిటిలో భాగంగా ఆల్రెడీ చాలా చోట్ల మెగా కీర్తనలు పాడేసాడు అనుకోండి.

తుపాకి నుంచి సేకరణ