‘రండి.. విధానాల్ని మారుద్దాం..!’ అంటూ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ యువతను పార్టీలోకి ఆహ్వానించారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం కర్నాటక లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో గురువారం పర్యటించి యువతతోనే ఎక్కువసేపు గడిపారు.
యువతరం రాజకీయాల్లో చేరాలని, రాజకీయ విధానాన్ని మార్చాలని , దేశం కోసం, పార్టీ కోసం కష్టించి, నిజాయితీగా పనిచేసిన వారికే యువజన కాంగ్రెస్ పదవులు లభిస్తాయన్నారు. నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వాన్ని నిరాకరిస్తామని పేర్కొన్నారు. మరి ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో సాధ్యమేనా? ఇప్పటి వరకు నేర చరిత్ర అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీ నుంచి పంపెస్తారా ? సమాధానం రాహుల్‌గాంధీ య్యే చెప్పాలి.