కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్రంలో సీ ఆర్ పీసీ (నేర న్యాయ శిక్షా స్మృతి) సవరణలు యుద్ధప్రాతిపదికన అమలులో కి వచ్చాయి. ఈ కొత్త చట్టం ప్రభావంతో ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఇక పోలీస్‌స్టేషనే కోర్టు కానుంది. అయితే కొత్త నిబంధనలు పోలీస్ యంత్రాంగానికి గుదిబండగా మారాయి.
ప్రస్తుతం పోలీసులు పలు కేసులకు సంబంధించి నిందితులను ఆయా కోర్టులకు తీసుకువెళితే సంబంధిత న్యాయమూర్తులు కొన్ని కేసులను తమ పరిధి కావంటూ అప్పుడే తిప్పిపంపడంతో కేసుల పరిష్కారానికి పోలీసులే చొరవ చూపాల్సి న పరిస్థితి ఏర్పడింది.
భారత శిక్షా స్మృతిలో 511, 89 సెక్షన్‌లలో మాత్రమే ఏడు సంవత్సరాల పైబడి ముద్దాయిలకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మిగిలిన కేసుల కు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే స్టేషన్ ష్యూరిటీల ఆధారంగా కొత్త నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా పోలీసులకు పని భారం తీవ్రతరం కానుంది.
ఈ కొత్త చ ట్టం అమలులోకి రావడం వల్ల పోలీసులకు బాగా పని పెరిగినా, ఇక న్యా యవాదుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మా రింది. కొత్త నిబంధనల నేపధ్యంలో కో ర్టుల్లో కేసుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరకొ ర కేసులకు పరిమితమైన న్యాయవాదులు పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. అంతేకాక ఈ కొత్త చట్టం అ మలు వల్ల పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది న్యాయవాదుల వా దన.