ర చ్చబండలో పోలీసుల రాజ్యం కనిపిస్తోంది. ఏగ్రామానికి వె ళ్ళినా జన ం కంటే పోలీసులు అధికంగా కనిపిస్తున్నారు. ఇద్దరు సీఐలు, 8మంది ఎస్సైలు, 30 మంది పోలీసులు రచ్చబండ విజవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. జై తెలంగాణ అంటే చాలు వారిని పోలీసులు పట్టుకుని పోయి జీపుల్లో ఎక్కిస్తున్నారు.
సమావే శం జరుగుతున్న సమీప ప్రాంతంలో తెలంగాణ ముచ్చట వినబడితే చాలు తెలంగాణ అన్న వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీంతో చాలా మంది రచ్చబండ వద్దకు రావడానికి జంకుతున్నారు. మహిళలు పూర్తిగా భయపడుతున్నారు. వందేమాతరం అంటే బ్రిటిష్‌వాళ్ళు భారతీయులను పట్టుకుపోయినట్లు ప్రస్తుతం జై తెలంగాణ అంటే పాపం అన్నట్లుగా మారిందని, ఒకప్పటి రజాకార్ల జమానాను తలపిస్తోందని వృద్ధులు వాపోతున్నారు.