సాంఘిక పాత్రలకే కాదు దేవతా పాత్రలకు కూడా రమ్యకృష్ణ పెట్టిందిపేరు. ఆమె ఏ దేవతా పాత్ర పోషించినా అచ్చు అలాగే ఉంటుందని ఊహిస్తారు ప్రేక్షకులు. ఆమె టైటిల్ పాత్రను పోషించిన చిత్రం 'మధురమీనాక్షి'. నాగార్జున యలవర్తి సమర్పణలో శ్రీ కామాక్షీతాయి మూవీమేకర్స్ పతాకంపై రాజవంశీ దర్శకత్వంలో మందలపు హరీష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. అతిథిగా విచ్చేసిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత వల్లభనేని వంశీమోహన్‌కు అందజేశారు.