తెలంగాణలో బంద్ రెండో రోజు కూడా విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు మూతబడ్డాయి. బంద్‌కు పలు ఆటో యూనియన్లు కూడా మద్దతు ప్రకటించటంతో పాటు తెలంగాణ జిల్లాల్లో పలు డిపోల్లో కూడా బస్సులను నిలిపి వేయటంతో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బైటకు తీస్తే తగలబెదతమంటూ, ఓయు, కేయు జెఎసి లు హెచ్చరికలు జారీ చేయటంతో ఈ డిపోలోని బస్సుని తీసేందుకు కార్మికులు కూడా ఒప్పుకోవట్లేదు.