దివంగత నటులు ఎన్.టి.రామారావు, ఎవ్జీుఆర్‌కు గతంలో మేకప్‌మెన్‌గా పనిచేసిన పీతాంబరం మృతిపట్ల పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తంచేశారు. సోమవారంనాడు ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఎన్టీఆర్‌కు దాదాపు 41 సంవత్సరాలు మేకప్‌మెన్‌గా చేశారు. అలనాటి ఎందరో ప్రముఖ తారలకు మేకప్ చేసిన ఆయన నిర్మాతగా కూడా మారి, ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాలను నిర్మించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారంనాడు చెన్నైలో జరిగాయి. ఆయన కుమారుడు ప్రముఖ దర్శకుడు పి.వాసు. ఈయన చంద్రముఖి, నాగవల్లి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.