విపక్షాల నిరసనల మధ్యే శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడటం లేదు.సభను సజావుగా జరిపేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ కోరినా ఫలితం లేకపోయింది.విపక్షాల నిరసన మద్య ప్రారంభం అయిన కొద్దినిముషాల్లోనే సభ వాయిదా పడింది.
వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ మరోసారి అసెంబ్లీని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ వాయిదా పడినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు.