నోములపై కోడిగుడ్లతో దాడి
నల్గొండ : సీపీఎం నేత నోముల నర్సింహయ్యపై శనివారం తెలంగాణవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్గొండ జిల్లా భువనగిరిలో దళిత సమస్యలపై పోరాటం చేస్తున్న ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణవాదులకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పదిమంది గాయపడ్డారు. ఈ దాడిని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండించారు.