ట్యాంక్‌బండ్ వద్ద లోక్‌సత్తా మానవహారం
లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద దాడి చేయడాన్ని నిరసిస్తూ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ వద్ద మానవహారం చేపట్టారు. జెపిపై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విలువల కోసం పోరాడుతున్న జెపిపై దాడిని ప్రజాస్వామ్యం దాడిగా వారు అభివర్ణించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో కూడదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని వారు కోరారు.