ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓ టీవి ఛానల్‌లో వచ్చినంత ఘనంగా కాకపోయినప్పటికీ ఇటు తెలంగాణలో ఉద్యమం తీవ్రత దృష్ట్యా, అటు సీమాంధ్రలో భావోద్వేగాల దృష్ట్యా టిఆర్ఎస్, జగన్ పార్టీ ఎంతో కొంత లాభ పడనున్న నేపథ్యంలో ఇద్దరు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు.
ఎన్నికలు వస్తే ఇరువురు లాభపడే పరిస్థితి కనిపిస్తున్నందునే వారు కలిసి ముందుకు సాగుతున్నట్టుగా .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రాంతంలో ఏ మాత్రం పట్టులేని జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఫీజు పోరును విజయవంతం చేయాలని .. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జగన్ ప్రారంభించిన దీక్షకు టిఆర్ఎస్ అనుబంధ విభాగం.. టిఆర్ఎస్‌వి సమీకరించే బాధ్యత తీసుకున్నట్టుగా సమాచారం.