కొందరిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వేలకు ఇది సమయం కూడా కాదన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువున్నా..ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు లేకున్నా.. సర్వే నిర్వహించాల్సిన ఆవశ్యకత .. ఎందుకొచ్చిందో? ఆ ఛానల్‌కి, ఏజన్సీకే తెలియాలి అని ఎద్దేవాచేసారు... ఎవరెందుకోసం పాట్లు పడుతున్నారో? ప్రజలు చూస్తున్నారని.. తగిన సమయంలో నిర్ణయం తీసుకోగల విజ్ఞత వారికి ఉందని వాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మహాత్మాగాంధీ పద్ధతిలో పోరాడుతామని చెప్పారని .. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఘటన ఆయనకు గాంధేయవాదంలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై, గవర్నర్ నరసింహన్ చేతిలోని ప్రతులు చించివేయడం వంటి చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయన్నాని.. కొందరు తెలంగాణ పేరుతో హింసకు పాల్పడుతూ తెలంగాణ ప్రజల పరువు తీశారన్నారు. ఒక సాధారణ డ్రైవర్ ఓ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారణమని... అభీష్టం నెరవేరకుంటే అందరూ నిరసనలు చేయవచ్చని... అయితే ఆ నిరసనలకు హద్దు ఉంటుందని అన్నారు.
తెలంగాణ కోసం అంటూ ఇక్కడ ఉద్యమాలు చేస్తే సరిపోదని..కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెళ్లినట్టు అందరూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.