వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం చెలరేగుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పేరిట ఉంది. జగన్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇంకా అనుమతి రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పోటీ చేయడానికి శివకుమార్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదిగా చెప్పుకోవడాన్ని కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి తాము ఇప్పటికే కోర్టులో దావా వేశామని చెప్పారు.