కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ. రాజాను సీబీఐ బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. లక్షా 76వేల కోట్ల కుంభకోణంలో రాజాకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పాటిల్ కమిషన్ నిర్ధారించింది. ఈ కేసులో రాజా అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది.
ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలకోసం టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరాను, అప్పటి రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. చందోలియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది.